దేశంలో ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి మండిపడ్డారు. దేశంలోని దాదాపు 81 కోట్ల మంది ప్రభుత్వం అందజేసే ఆహార ధాన్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి వస్తుందని స్వాతంత్య్ర యోధులు కానీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కానీ ఊహించి ఉండరని ఆమె వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు మాయావతి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎందరో నిరుపేదలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. తమ జీవితాల్ని బాగుచేసుకునేందుకు దోహదపడే మంచి ప్రభుత్వాన్ని వారు ఎన్నుకోలేకపోయారనే విషయాన్ని తాజా ఎన్నికల ఫలితాలు రుజువుచేస్తున్నాయి. ఎన్నికలకు ముందున్న వాతావరణానికి, ఫలితాలు వెలువడిన తర్వాత మనం చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం కనబడుతోంది. ఇదో కొత్త కోణం. ఇది మనల్ని కలవరపెట్టే విషయం’’ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీఎస్పీ రెండు సీట్లు గెలించింది. ఛత్తీస్‌గఢ్, మద్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు.
👉 – Please join our whatsapp channel here –