నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నివాళులు అర్పించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు నిరుపమానమని సీఎం జగన్ అన్నారు.
కాగా, సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాయలంలో సీఎం జగన్.. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్. ఈ కార్యక్రమానికి మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
👉 – Please join our whatsapp channel here –