Movies

కేరళకు ప్రయాణం కానున్న మహేశ్‌బాబు

కేరళకు ప్రయాణం కానున్న మహేశ్‌బాబు

కేరళకు ప్రయాణం కానున్నారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా తాజా షూటింగ్‌ షెడ్యూల్‌ ముగిసిందని తెలిసింది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మహేశ్‌బాబు, మీనాక్షీ చౌదరి కాంబినేషన్‌లో ఓ పాటను చిత్రీకరించారని సమాచారం.

కాగా ‘గుంటూరు కారం’ నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ కేరళలో ఆరంభం కానుందట. కొంత టాకీ పార్టుతో పాటు మహేశ్‌బాబు, శ్రీలీల కాంబినేషన్‌లో ఓ సాంగ్‌ను ప్లాన్‌ చేసిందట యూనిట్‌. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరిపి, ఈ నెలాఖరుకల్లా సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z