తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను పవన్ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తెదేపా-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నవంబర్ 4న వీరిద్దరూ భేటీ అయ్యారు. తరచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది.
👉 – Please join our whatsapp channel here –