తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కాంగ్రెస్ (Congress) అగ్రనేతలను ఆయన ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన రేవంత్.. ఆ తర్వాత అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ను కలిశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన అనంతరం మంత్రివర్గ కూర్పు, ఇతర అంశాలపై వారితో ఆయన చర్చించారు. సోనియా, రాహుల్‌తో సుమారు 50 నిమిషాల పాటు వివిధ అంశాలపై రేవంత్ చర్చలు జరిపారు.
👉 – Please join our whatsapp channel here –