ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినికి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. రిటైర్డు ఉద్యోగి అయిన వెంకటస్వామి, మంగమ్మ దంపతులకు మొదటి సంతానం రజిని. దివ్యాంగురాలైన ఆమె కష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డిని కలిసి.. ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆమెను ఆహ్వానించారు.
👉 – Please join our whatsapp channel here –