Politics

కొత్త సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికలు

కొత్త సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికలు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి, ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను కోరింది ఎలక్షన్ కమిషన్. సర్పంచ్, వార్డుమెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగియనుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియను ప్రారంభించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z