Business

తుఫాన్ ప్రభావంతో నేడు పలు రైళ్ల రద్దు!

తుఫాన్ ప్రభావంతో నేడు పలు రైళ్ల రద్దు!

మిచాంగ్‌’ తుపాను ఏపీలోని పలు జిల్లాలను కుదిపేసింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, 80-110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలు­లతో ఏపీలోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపో­యాయి. 3 రోజు­లుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీళ్లు ఉండడంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

మిచాంగ్‌ తుపాను తీరం దాటడంతో.. రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా రైళ్లను రద్దు చేసింది. దాంతో నిత్యం కిటకిటలాడే విజయవాడ స్టేషన్‌ రైళ్ల రద్దుతో ప్లాట్‌ఫారాలు ఖాళీగా మారాయి. మిచాంగ్‌ తుపాను నేపథ్యంలో బుధవారం (డిసెంబర్ 6) కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంటూరు- రేపల్లె (07784/07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి (07875/07876), రేపల్లె-తెనాలి (07787/07888), గుంటూరు-రేపల్లె (07887), చెన్నైసెంట్రల్‌-న్యూజల్పాయిగురి (22611) వెళ్లే రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. తుపాను కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను బుధవారం నుంచి పునరుద్ధరించారు. సికింద్రాబాద్‌-గూడూరు (12710), తిరుపతి-లింగంపల్లి (12733), సికింద్రాబాద్‌-తిరుపతి (12764), కాకినాడటౌన్‌-బెంగళూరు (12710) రేపటి నుంచి నడవనున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z