తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రేవంత్ ప్రమాణ స్వీకారంపై ఆంధ్రాలో వెలసిన బ్యానర్ ఆసక్తికరంగా మారింది. రేవంత్ ప్రమాణ స్వీకారం.. చంద్రబాబు ఫొటోతో బ్యానర్ ఏర్పాటు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నందిగామ, వీరులపాడులో బ్యానర్లు వెలిశాయి. వీరులపాడులో ఎన్టీఆర్, చంద్రబాబుతో (TDP Chief Chandrababu Naidu) తంగిరాల సౌమ్యతో పాటు రేవంత్ ఫొటోలు ఉన్న బ్యానర్ ఏర్పాటు చేశారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఫ్లెక్సీలు వెలిశాయి. అటు నందిగామలో చంద్రబాబు,రేవంత్ ఫోటోలతో ప్లేక్సీ ఏర్పాటుచేశారు. ‘‘బాబు గారి అనుంగ శిఝ్యడు, మేము మెచ్చిన డేరింగ్, డైనమిక్ లీడర్ రేవంత్ అన్నకు పట్టాభిషేకం’’ అంటు ప్లేక్సీలపై రాశారు. చంద్రబాబు, రేవంత్ ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలను ప్రజలు ఆసక్తికగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.
👉 – Please join our whatsapp channel here –