మంత్రివర్గ తొలి సమావేశం సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని తెలుస్తోంది. శుక్రవారం దీనిపై సమీక్ష చేద్దామని అంటూ.. ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించవద్దని.. శుక్రవారం నాటి సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని సీఎం ఆదేశించారు.
👉 – Please join our whatsapp channel here –