తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు.
👉 – Please join our whatsapp channel here –