Movies

విజయ్ 68 నుండి లేటెస్ట్ అప్‌డేట్

విజయ్ 68 నుండి లేటెస్ట్ అప్‌డేట్

కోలీవుడ్‌లో అభిమానులు అందరూ విజయ్‌ను దళపతిగా పిలుచుకుంటారు. ఆ పేరుకు తగినట్లు ఆయన నుంచి బ్లాక్‌బస్టర్‌ చిత్రం వచ్చి చాలా కాలమైంది. మాస్టర్‌ చిత్రం తరువాత ఈయన నటించిన ‘బీస్ట్‌’ చిత్రం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. ఆ తరువాత నటించిన ‘వారసుడు’ మిశ్రమ స్పందననే తెచ్చుకుంది. ఇక తాజాగా విజయ్‌ నటించిన ‘లియో’ చిత్రం ఆయనకున్న స్టామినాతో వసూళ్ల వర్షం కురిపించినా, మంచి రిజల్ట్‌ను మాత్రం పొందలేకపోయింది. ఈయన తాజాగా నటిస్తున్న తన 68వ చిత్రం పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు బిగిల్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్‌ సంస్థ రూపొందిస్తోంది.

మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఇందులో నటి స్నేహ, ప్రశాంత్‌, ప్రభుదేవా, వైభవ్‌, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ఆ తరువాత థాయ్‌లాండ్‌లో ఫైట్‌ సీక్వెన్స్‌, కొన్ని కీలక సన్నివేశాలను జరుపుకుని ప్రస్తుతం మళ్లీ చైన్నెలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇలా బ్రేక్‌ లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు.త్వరలోనే చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేయడానికి యూనిట్‌ వర్గాలు రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం.

చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా తెరపైకి రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం యువన్‌ శంకర్‌ రాజా కొన్ని ట్యూన్స్‌ సిద్ధం చేస్తున్నట్లు, అవి ఊరా మాస్‌గా వచ్చాయని సమాచారం. మరో విషయం ఏమిటంటే సీనియర్‌ దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత గంగై అమరన్‌ ఈ చిత్రం కోసం ఒక పాట రాసినట్లు తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z