ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది. మొత్తం 7వేల మంది ముఖ్యులకు ఆహ్వానాలను పంపుతోంది. వారిలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్ తదితరులు ఉన్నారు. రామాయణ్ సీరియల్‌లో శ్రీరాముడు, సీతగా నటించిన అరుణ్ గోవిల్, దీపికా చిక్‌లియాలకూ ఆహ్వానం అందనుంది. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయోధ్యలో కరసేవ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను, 4,000 మంది యోగులను తదితరులను ఆహ్వానించాలని రామాలయ ట్రస్టు నిర్ణయించింది.
రామాలయంలో ప్రతిష్ఠించే రామ్‌లల్లా విగ్రహాన్ని ఈ నెల 15న ఖరారు చేయనున్నట్లు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. కర్ణాటక, రాజస్థాన్ నుంచి తెచ్చిన శిలలతో మొత్తం మూడు విగ్రహాలను శిల్పులు రూపొందించారని, అందులో అత్యుత్తుమ విగ్రహాన్ని ఖరారు చేస్తామని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –