కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న మూడు థియేటర్లలో ఆగంతుకులు గుర్తు తెలియని పదార్థాన్ని స్ప్రే చేయడంతో కలకలం రేగింది. ప్రేక్షకులు అసౌకర్యానికి గురవడంతో అధికారులు వారిని థియేటర్ల నుంచి ఖాళీ చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ టొరంటో ప్రాంతంలో హిందీ చిత్రాలను ప్రదర్శిస్తున్న మూడు థియేటర్లలో మంగళవారం 3 గంటల వ్యవధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు స్ప్రే చేసి పారిపోయినట్లు తెలిపారు. దీని ప్రభావంతో కొందరు ప్రేక్షకులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వచ్చి ప్రేక్షకులను బయటకు తరలించారు. అస్వస్థతకు గురైనవారికి చికిత్స అందించారు. ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
👉 – Please join our whatsapp channel here –