రక్షణ రంగంలో కీలక విభాగమైన భారత నావికాదళంలో సిబ్బంది కొరత భారీస్థాయిలో ఉంది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్రం తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్ 31వ తేదీ నాటికి నౌకాదళంలో మొత్తంగా 10,896 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆఫీసర్ ర్యాంక్ పోస్టులే 1,777 దాకా ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –