దేశవ్యాప్తంగా జనవరి 24వ తేదీ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ తొలి విడతకు రికార్డు స్థాయిలో 12.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 3.70 లక్షలు అధికం. ఈ సారి అత్యధిక దరఖాస్తుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. మహారాష్ట్ర నుంచి 1.60 లక్షల మంది, ఏపీ నుంచి 1.30 లక్షలు, తెలంగాణ నుంచి 1.20 లక్షల మంది పరీక్షలు రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరొచ్చు. బీటెక్ సీట్ల కోసం మెయిన్‌లో పేపర్-1, బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 రాయాల్సి ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –