మీరో విషయం గమనించారో లేదో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. లావాదేవీలన్నీ మొబైల్, యూపీఐ, ఏటీఎం, క్రెడిట్ కార్డులు వంటి వాటితో జరిగిపోతున్నాయి. చెక్కులు, డీడీల వాడకం బాగా తగ్గిపోయింది. దాంతో బ్యాంక్ ఉద్యోగులకు ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి. వారు చేపడుతున్న విధుల్లో కూడా చాలా మార్పులొచ్చాయి. అందుకే ఈ రోజుల్లో బ్యాంకులు రకరకాల సర్వీసులు అందిస్తున్నాయి. ఐతే.. ఉద్యోగుల సెలవులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
బ్యాంక్ ఉద్యోగులకు వారానికి 5 రోజులు పని దినాలు, 2 రోజులు సెలవులు ఇచ్చేలా చెయ్యమని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కావాలంటే.. రోజువారీ బ్యాంక్ ఉద్యోగుల పనిగంటలు పెంచమని సూచించింది. అలా పెంచడం ద్వారా.. వారానికి 2 రోజులు సెలవు ఇచ్చేందుకు వీలవుతుందని సూచించింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
దీని వల్ల ప్రొడక్టివిటీ తగ్గేదేమీ ఉండదని నిపుణులు అంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వారానికి 5 రోజులే పనిచేస్తారనీ, మిగతా 2 రోజులూ వారు మనీ ఖర్చుపెట్టడం ద్వారా.. సొసైటీలో మనీ ప్రవాహం బాగుంటుందని సూచిస్తున్నారు. అదే విధంగా బ్యాంక్ ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. మరి కేంద్రం ఏమంటుంది? ఒప్పుకుంటుందా? త్వరలో తెలుస్తుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z