DailyDose

గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని డిమాండ్

గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని డిమాండ్

గ్రూప్‌-2కు పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 47కు పెంచాలని ప్రభుత్వాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ‘గ్రూప్‌-2 పోస్టుల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏటా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటికే చాలా మంది నిరుద్యోగుల వయస్సు నిర్దేశిత వయోపరిమితిని దాటి అనర్హులుగా మారారు. వారికి అవకాశం కలిగేలా వయోపరిమితిని పెంచి, స్డడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించాలి’ అని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z