Agriculture

ప్లాట్ల కేటాయింపు కోసం ఈ-లాటరీ

ప్లాట్ల కేటాయింపు కోసం ఈ-లాటరీ

ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందినవారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు ఈ నెల 15న ఈ-లా టరీ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో భూసమీకరణలో పొలాలిచ్చిన రైతుల్లో కొందరికి భూసేకరణ (భూసమీకరణకు విముఖత చూపిన వారి) భూముల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఆ తరువాత ప్రభుత్వం మారడం, రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో తమకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని రైతులు సీఆర్డీఏను కోరారు. ఇలాంటివి 2,243 ప్లాట్లు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్లాట్లు కలిగి ఉన్న 679 మంది రైతులకు సీఆర్డీఏ రెండు విడతలుగా నోటీసులు పంపింది. రైతులు అంగీకారం తెలిపితే భూసేకరణ భూముల్లో ఉన్న ప్లాట్లను రద్దు చేసి, ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయిస్తామని వాటిలో పేర్కొంది. అయితే 44 మంది రైతులు మాత్రమే ప్రత్యామ్నాయ ప్లాట్లకు అంగీకారం తెలిపారు. వారికి ఈ నెల 15న విజయవాడ గవర్నరుపేటలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు సీఆర్డీఏ ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z