భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత పేర్కొన్నారు.
కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
👉 – Please join our whatsapp channel here –