టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన నా సామి రంగ టైటిల్, ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే (Yettukelli Povalanipisthunde) అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే.. అంటూ ఈ ప్రోమో సాగింది. పల్లెటూరి నేపథ్యంలో కీరవాణి అందించిన బాణీకి రామ్ మిరియాల అందించిన గాత్రం పాటకు హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సాంగ్ పూర్తి పాటను డిసెంబర్ 10 ఉదయం 11.35 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరితో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –