తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ (Praja Darbar)ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు.
మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సచివాలయానికి వెళ్లనున్నారు. విద్యుత్‌శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –