మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన కస్టమర్లకు సాయం చేయటానికి ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తుపాను కారణంగా సమస్యల్లో చిక్కుకున్న వినియోగదారులకు ఉచితంగా టోయింగ్, సమగ్ర వాహన తనిఖీ సర్వీసును అందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని కస్టమర్లు ఇందుకోసం 1800-2100-007 టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించింది. డిసెంబరు 8 నుంచి 20లోగా కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. అలానే వరదలో చిక్కుకున్న మోటార్‌సైకిల్ ఇంజన్లను ఉపయోగించకుండా ఉంటేనే మంచిదని కస్టమర్లకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సూచించింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఆడి, ఫోక్స్‌వ్యాగన్ తదితర వాహన సంస్థలూ ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించాయి.
👉 – Please join our whatsapp channel here –