తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెనాలికి వెళ్తూ మార్గమధ్యంలో ఆగారు. రేవేంద్రపాడు వద్ద రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘ప్రజల కష్టాలు ఇక మూడు నెలలే. పొలాల్లో ఉండి రైతు కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులెక్కడ? పంట నష్టపరిహారం నేను పెంచుకుంటూ వెళ్తే.. జగన్ తగ్గించారు. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు ధైర్యంగా ఉండాలి’’ అని అన్నారు. అనంతరం నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు.
👉 – Please join our whatsapp channel here –