Devotional

కుంభరాశి వారికి అనుకూలం-వారఫలాలు-10/12/2023

కుంభరాశి వారికి అనుకూలం-వారఫలాలు-10/12/2023

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో తగిన గుర్తింపు పొందుతారు. దైవభక్తి, గురుభక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ.. నూతన వస్ర్తాలు, వస్తువులు, ఆభరణాలను కొంటారు.

అనవసరమైన ఆలోచనలు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. పనులు ముందుకు సాగవు. ఉద్యోగులకు బదిలీలు జరుగుతాయి. పిల్లలతో అభిప్రాయభేదాలు, బంధుమిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభకార్యాల విషయాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా కొన్ని పనులు వాయిదా పడుతాయి.

వృషభం
బంధుమిత్రులతో సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు పూర్తవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త దుస్తులు, నగలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ధైర్యంగా కొత్త పనులు చేపడతారు. గిట్టనివారితో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఫలితంగా వృథా ఖర్చులు ఉంటాయి. నలుగురికి ఉపయోగపడే పనులకు సహాయం చేస్తారు. వృత్తుల్లో రాణిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ప్రయాణాల వల్ల అనారోగ్యం పాలవుతారు.

మిథునం
విందులు, విహార యాత్రలతో మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోవాలి. వ్యవసాయదారులు ఇబ్బంది పడుతారు. వ్యాపారాల్లో తాత్కాలిక లాభం ఉన్నా.. దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. గిట్టనివారి వల్ల ఇబ్బందులు పడతారు. అప్పుల బాధలు, వృథా ఖర్చులు పెరుగుతాయి. పిల్లల విదేశీ చదువుల విషయంలో ఆటంకాలు ఏర్పడుతాయి.

కర్కాటకం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల ఉన్నత విద్యకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. శత్రువుల వల్ల పరోక్ష లాభం చేకూరుతుంది. విహారయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. శుభకార్యాలు, ఆస్తుల కొనుగోలుకు అనుకూల సమయం. వ్యాపారులు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారి ఆదాయం పెరుగుతుంది.

సింహం
నిబద్ధతతో పనులు చేస్తే.. సత్ఫలితాలు అందుతాయి. వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు బదిలీలు జరుగుతాయి. శుభకార్యాల విషయంలో కొన్ని అవరోధాలు ఎదురుకావచ్చు. డబ్బు సమయానికి అందదు. తీర్థయాత్రలు, విహారయాత్రలతో మనశ్శాంతి పొందుతారు. ఉద్యోగంలో తోటివారితో ఇబ్బంది పడతారు. అనవసరమైన బాధ్యతలు నెత్తికెత్తుకుంటారు. ఫలితంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతారు. వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో పనులు ముందుకు సాగవు.

కన్య
ఊహించని మంచి ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ధైర్యంగా పనులు చేస్తారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. న్యాయవాద, వైద్య, ఇంజినీరింగ్‌ వృత్తిలో ఉన్నవారికి బాగా అనుకూలం. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యతతో ఉంటారు. దీర్ఘకాలిక పనుల్లో జాగ్రత్త అవసరం. శుభకార్య స్వప్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుల ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వృథా ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలతో ప్రయాస. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరం.

తుల
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. చదువు, శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీలు, ఆశించిన ప్రమోషన్లు ఉంటాయి. డబ్బు సకాలంలో అందుతుంది. తీర్థయాత్రలు, పుణ్య నదీ స్నానాలు ఆచరిస్తారు. వ్యాపారం కలిసి వస్తుంది. నిత్యావసర, వడ్డీ, షేర్‌, ఆటోమొబైల్‌ వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో అనుకూలత ఉంటుంది. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత అవసరం.

వృశ్చికం
సమయ పాలన, నిబద్ధత, ఖర్చుల నియంత్రణ అవసరం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, కళా రంగాలలో ఉన్నవారికి సంతృప్తిగా ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి అందదు. పనివారితో ఇబ్బందులు, మిత్రులతో విభేదాలు ఉంటాయి. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయుల సూచనలను పాటించక పోవడం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆఫీసులో తోటి వారితో కలహాలు, పై అధికారులతో వైషమ్యాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి.

ధనుస్సు
వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. కొత్త వస్ర్తాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యా పిల్లలతో సుఖంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రమోషన్లు ఆగిపోవచ్చు. పై అధికారులతో దూరం పెరుగుతుంది. చదువులు, శుభకార్యాల విషయంలో ఆటంకాలు ఏర్పడుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. రావాల్సిన డబ్బు సమయానికి అందదు. వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయి. వృథా పెట్టుబడులతో ఇబ్బంది పడుతారు.

మకరం
దీర్ఘకాలిక పనులు పూర్తవుతాయి. మంచివారితో సాహచర్యం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అన్నదమ్ములతో మనస్పర్ధలు, వాహనాల మూలంగా ఖర్చులు ఉంటాయి. వ్యాపారంలో అనాలోచిత పెట్టుబడులతో ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు. ఆర్థిక సమస్యలతో గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి.

కుంభం
రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నలుగురికీ సహాయం చేస్తారు. ఉద్యోగంలో మంచి పేరు, పదోన్నతి సంపాదిస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నిత్యావసర వస్తువుల వ్యాపారం, వడ్డీ వ్యాపారం అనుకూలిస్తాయి. పూర్వం ప్రారంభించిన పనులు ముందుకు సాగుతాయి. పెద్దల సహాయ సహకారాలను పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మీనం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో తగిన గుర్తింపు పొందుతారు. దైవభక్తి, గురుభక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ.. నూతన వస్ర్తాలు, వస్తువులు, ఆభరణాలను కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. న్యాయవాద, ఇంజినీరింగ్‌ వృత్తిలో ఉన్న వారికి డబ్బు సమయానికి అందదు. కళాకారులు కొత్త ప్రయోగాలు ప్రారంభిస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z