తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాగా, కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది నేటి నుంచి అమలులోకి రానున్నట్టు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.
వివరాలు ఇలా..
ఆరోగ్యశ్రీ క్రింద వైద్యానికి రూ.10 లక్షలకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఇది నేటి నుంచి అమలు.
2004లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్ఆర్.
ఇది వరకు ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఉంది.
నేటి నుంచి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే అవకాశం
రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు.
రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు
293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీలలో అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు.
ఆరోగ్య శ్రీ కింద అందుబాటులో ఉన్న 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలు
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z