Politics

శుక్రవారం మంత్రివర్గ భేటీ

శుక్రవారం మంత్రివర్గ భేటీ

ఈ నెల 15వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. తొలుత ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినా, 15వ తేదీకి మార్పు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.

ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు మంత్రివర్గ సమావేశంలో ఉంచే ప్రతిపాదనలను 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు సమర్పించాలని సీఎస్‌ ఆదేశించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z