భారీగా అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులకు వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే 11మంది ఇంఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ.. మొత్తం 62 చోట్ల ఇంఛార్జ్ లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇక, 30మందికిపైగా సిట్టింగ్ లకు ఈసారి టికెట్లు నిరాకరించే పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందిని పార్లమెంటు నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి ఒంగోలు, గుంటూరు జిల్లాలలో మార్పులు చేసిన వైసీపీ రేపు(డిసెంబర్ 12) మరో ఉమ్మడి జిల్లాలో మార్పులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో శ్రేణులను విజయవంతంగా నడిపించడం.. ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని, ఆ మేరకు సామర్థ్యం ఉన్న వారిని ఇంఛార్జిలుగా జగన్ నియమిస్తున్నట్లు సమాచారం.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కచ్చితంగా పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావించారు జగన్. ఇటీవలే చేసిన కొన్ని సర్వేల నేపథ్యంలో పార్టీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగానే మొత్తం 62 చోట్ల ఇంఛార్జ్ లను మార్చాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మొదటి విడతలో 11 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పులు చేశారు. ఈ 11 నియోజకవర్గాల్లో మొత్తం నలుగురికి సంబంధించి స్థాన చలనం కలిగించారు. మొత్తం ముగ్గురికి టికెట్ లేదని కన్ ఫర్మ్ చేసేశారు. మిగిలిన చోట్ల కొత్త ఇంఛార్జ్ లను నియమించారు. తొలి విడతలో భాగంగా 11మందికి సంబంధించి మార్పులు చేయగా, రానున్న రోజుల్లో విడతల వారిగా ఈ మార్పులు ఉండబోతున్నాయి. మొత్తం 62 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పులు కచ్చితంగా ఉండబోతున్నాయని సమాచారం.
ఇక 30 మందికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థాన చలనం ఉంటుంది. ఈరోజు ప్రకటించిన 11మంది లిస్టులో స్థాన చలనం కల్పించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో నలుగురికి వేర్వేరు స్థానాల్లో అవకాశం కల్పించారు. ఇలా 62 మార్పుల్లో 30మందికి పైగా స్థానచలనం కలిగించే అవకాశం ఉంది. మరో 30మందికి దాకా టికెట్ పూర్తిగా లేనట్లుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
ఎవరికైతే టికెట్ లేదని నిర్ణయానికి వచ్చారో వారితో అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిన్న(డిసెంబర్ 10) సాయంత్రమే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు కూడా టికెట్ లేదని చెప్పినట్లుగా సమాచారం. గాజువాక వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డికి కూడా టికెట్ లేదని ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారం. ఈసారి ఎన్నికల్లో టికెట్ లేదని కన్ ఫర్మ్ కావడంతో అటు ఆర్కే కానీ ఇటు దేవన్ రెడ్డి కానీ రాజీనామా చేసేశారు. మిగతా వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా 62 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పు అనేది వైసీపీలో ఉండబోతున్నట్లుగా సమాచారం.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లేక మంత్రులుగా ఉన్న కొందరిని పార్లమెంటుకు పంపే ఆలోచనను వైసీపీ అధిష్టానం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరిని పార్లమెంటుకు కూడా పంపించాలనేది సీఎం జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. అలాగే పార్లమెంటు ఎంపీలుగా ఉన్న కొందరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా వరుసగా విడతల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రకటనలు ఉంటాయి.
ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత మార్పులు అనేవి కచ్చితంగా చేయాలి, అవి ఎక్కువ సంఖ్యలో చేయాలని జగన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే, తెలంగాణలో ఇలాంటి మార్పులు చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ కు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని, ఓటమి పాలైంది అనే ఒక అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఏపీలో రాకుండా జగన్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఇందులో భాగంగానే మొత్తం 62 చోట్ల ఇంఛార్జ్ ల మార్పులు ఉండబోతున్నాయి. ఇందులో 30మంది సిట్టింగ్ లకు పూర్తిగా టికెట్ ఉండదు అనేది స్పష్టమవుతోంది. మరో 30 చోట్ల కచ్చితంగా స్థానచలనం ఉండబోతున్నట్లుగా సమాచారం.
11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిల మార్పు..
నియోజకవర్గం – ఇంఛార్జి పేరు
1. ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్
2. కొండేపి- ఆదిమూలపు సురేశ్
3. వేమూరు- వరికూటి అశోక్ బాబు
4. తాడికొండ- మేకతోటి సుచరిత
5. సంతనూతలపాడు- మేరుగు నాగార్జున
6. చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు
7. గుంటూరు (వెస్ట్)- విడదల రజని
8. అద్దంకి- పాణెం హనిమిరెడ్డి
9. మంగళగిరి- గంజి చిరంజీవి
10. రేపల్లె- ఈవూరు గణేశ్
11. గాజువాక- వరికూటి రామచంద్రరావు
👉 – Please join our whatsapp channel here –