Politics

విశాఖలో రోడ్డు మూసివేయడంపై జనసేన కార్యకర్తలు ఆందోళన

విశాఖలో రోడ్డు  మూసివేయడంపై జనసేన కార్యకర్తలు ఆందోళన

నగరంలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌తో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. దీంతో వీఐపీ రోడ్డులో భారీగా పోలీసులను మోహరించి మూర్తియాదవ్‌తో పాటు, జనసేన కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.

ఈ మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లి స్థానిక వినాయక ఆలయం నుంచి మలుపు తిరిగి రావాల్సి వస్తోంది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యం దృష్ట్యా రోడ్డు మధ్యలో వేసిన సిమెంట్‌ స్టాపర్స్‌ను తొలగించాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. దీంతో నేడు జనసైనికులు, వీర మహిళలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. స్టాపర్స్‌ను తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఈ ధర్నాలో పాల్గొన్న నిరసనకారులను అరెస్టు చేసి మూడో పట్టణ ఠాణాకు తరలించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z