జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఖండించారు. ఆయన అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. విశాఖలోని టైకూన్ జంక్షన్ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. జనసేన (Janasena) శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. నాదెండ్లతో (Nadendla Manohar) పాటు అరెస్టు చేసిన మిగతా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే విశాఖ వస్తా.. పోరాడుతా అని హెచ్చరించారు. ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తుదోషం ఉందనే రోడ్డు మూసేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
నగరంలోని టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దీనిపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన నాదెండ్ల మనోహర్‌ను ఆయన బస చేసిన నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ గేటు వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్న నాదెండ్లను పోలీసులు అరెస్టు చేశారు.
👉 – Please join our whatsapp channel here –