తెలంగాణ ఆర్ అంబ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు సాయంత్రం 5.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో రహదారుల ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి చర్చించనున్నారు.
విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణపై ఆయన చర్చించే అవకాశం ఉందని సమాచారం.నిన్ననే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –