తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీని నిర్వహించారు. గుంటూరు నగరంలో ఈ ర్యాలీని మన్నవ మోహన కృష్ణ జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ లోకేష్ యువగళం పాదయాత్ర దేశ రాజకీయాలలో సంచలనం అని కొనియాడారు. టిడిపి అధికారంలోకి రావడానికి యువగళం యాత్రే పునాది అన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని యువగళం తీసుకోచ్చింది అని మన్నవ మోహన కృష్ణ అన్నారు.
యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో 200 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించామని, ఇప్పుడు 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్బంగా 3వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తాము చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి, అలాగే పండుగ సందర్బంగా అందజేస్తామన్న చంద్రన్న కానుకలను ప్రభుత్వం అడ్డుకున్నా పార్టీ శ్రేణులు సమిష్టిగా నిలిచి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆయన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరో 3 నెలలలో టిడిపి అధికారంలోకి రావడం, ప్రజా రంజక పాలన అందించడం తథ్యమన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z