Sports

క్రికెట్‌లో రేపటి నుంచి కొత్త రూల్

క్రికెట్‌లో రేపటి నుంచి కొత్త రూల్

క్రికెట్‌ (Cricket)లో రేపటి నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ‘స్టాప్‌ క్లాక్’ పేరుతో సరికొత్త నిబంధనను ఐసీసీ (ICC) ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తన తర్వాతి ఓవర్‌లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే రెండుసార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అలానే జరిగితే.. బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ జట్టు స్కోరులో యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని లెక్కిస్తారు. ఆట వేగాన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. డిసెంబరు 12 నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభంకానున్న ఐదు టీ20 సిరీస్ నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ కొత్త రూల్ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z