తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. సచివాలయ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు శాఖలకు భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు.
ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద రూ.374కోట్ల నిధులను విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.298కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996కోట్లు, మేడారం జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్ల నిధులను విడుదల చేస్తూ సంబంధిత దస్త్రాలపై భట్టి విక్రమార్క సంతకాలు చేశారు.
అంతకుముందు మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క దంపతులు గృహ ప్రవేశం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రజాభవన్‌ను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –