2024 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఒకటి. మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీలీల (Sree Leela), మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఓ పాటను విడుదల చేయగా తాజాగా మరో గీతాన్ని రిలీజ్ చేసింది. ‘ఓ మై బేబీ’ (Oh My Baby) అంటూ సాగే ఈ మెలోడిని రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ స్వరాలు సమకూర్చారు. శిల్పారావు ఆలపించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రోమో ఫుల్ సాంగ్‌పై శ్రోతల్లో ఆసక్తి రేకెత్తించింది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
👉 – Please join our whatsapp channel here –