ఇప్పుడు రోజువారీ కూరగాయలు మొదలు కరంట్, గ్యాస్, ఫోన్ రీచార్జీ, పెట్రోల్ బిల్లు.. ఇలా ప్రతిదీ డిజిటల్ పేమెంట్సే.. యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్ ద్వారా క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. మన బంధు మిత్రులకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, వ్యాపార లావాదేవీల్లో చెల్లింపులు, క్యాష్ ట్రాన్స్ ఫర్ కూడా అంతే క్షణాల్లో పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ మంగళవారం నిర్ణయం తీసుకున్నది.
మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు వివిధ క్యాటగిరీల్లో ఆటోమేటిక్ చెల్లింపులకు రూ.15 వేల నుంచి రూ. లక్ష వరకూ పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. వీటికి అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) నుంచి మినహాయింపు ఇచ్చింది. యూపీఐ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, క్రెడిట్ కార్డు బిల్లులను రూ.15 వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు తెలిపింది. అత్యధిక జనాభా గత నెలలో 11.23 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –