Politics

బాధ్యతలు స్వీకరించనున్న మరో ఆరుగురు మంత్రులు

బాధ్యతలు స్వీకరించనున్న మరో ఆరుగురు మంత్రులు

తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలత మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అనంతరం ఆయనతో ప్రమాణం చేయిస్తారు. శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగించే విషయాన్ని స్పీకర్‌ ప్రకటించనున్నారు. ఆ తరువాత స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని శాసనసభ వర్గాలు తెలిపాయి. సభాపతి ఎన్నిక దృష్ట్యా శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్న నేపథ్యంలో.. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి మండలి సమావేశం కానున్నది. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలుపునుంది. కాగా, గురువారం మరో ఆరుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సహా మరో ముగ్గురు మంత్రులు వీరిలో ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z