Business

ఆధార్ సేవలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఆధార్ సేవలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఆధార్‌ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై యూఐడీఏఐకు మెయిల్‌ లేదా 1947 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి సూచించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z