DailyDose

యూట్యూబర్ ఇంట్లోని సీసీటీవీ హ్యాక్-నేర వార్తలు

యూట్యూబర్ ఇంట్లోని సీసీటీవీ హ్యాక్-నేర వార్తలు

 రాజన్న సిరిసిల్లలో దారుణం

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో(Land dispute) ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం(Brutal murder) స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెలో త్యాగ రాకేష్ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు త్యాగ తిరుపతి  గొడ్డలితో నరికి చంపాడు. రాకేష్ హత్యకు భూ తగాదాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్‌ మరణంతో నర్సింహులపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

యూట్యూబర్ ఇంట్లోని సీసీటీవీ హ్యాక్

ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలే వారి పాలిట శాపంగా మారాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌ను హ్యాక్ చేసిన దుండగులు ఓ యూట్యూబర్‌ కుటుంబాన్ని అభాసుపాలు చేసింది. ముంబై మహానగరం బాంద్రాలో నివసిస్తున్న యూట్యూబర్‌ తన ఇల్లు, కుటుంబ భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. అతని తల్లి, సోదరి ఇంట్లో ఉన్న సమయంలో వారి నగ్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై యూట్యూబర్ ముంబైకి చెందిన బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.21 ఏళ్ల యూట్యూబర్ భద్రతా ప్రయోజనాల కోసం తన ఇంటిలో అమర్చిన సీసీ టీవీ కెమెరాను బయటి వ్యక్తి హ్యాక్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ కెమెరాలో రికార్డయిన తన తల్లి, సోదరి నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని చెప్పాడు. సంచలనం సృష్టించిన ఈ కేసును బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, యూట్యూబర్ తన స్నేహితులలో ఒకరు తనకు ఫోన్ చేసి, తన తల్లి, సోదరి వ్యక్తిగత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని చెప్పాడు. ఈ సమాచారం ఆధారంగా తన ఇంట్లోని సీసీటీవీని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు బాధితుడికి తెలిసింది. వీడియో నవంబర్ 17, ఆమె తల్లి, సోదరి వేర్వేరు సమయాల్లో బట్టలు లేకుండా బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు అది సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వ్యక్తిగత వీడియోను కొందరు దుండగులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.యూట్యూబర్‌ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్‌ 500, 501, ఐటీ సెక్షన్‌ 66(సీ), 66(ఈ), 67(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాంద్రా పోలీసు అధికారి మాట్లాడుతూ, ఈ చాలా సున్నితమైన అంశం.. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీటీవీ సిస్టమ్‌ను హ్యాక్ చేయడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందిగా అన్ని సోషల్ మీడియా సైట్‌లను అభ్యర్థించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

* డ్రగ్స్‌ సేవిస్తూ పార్క్‌లో దొరికిన యువకుడు

పార్క్‌లో డ్రగ్స్‌ సేవిస్తూ ఒక యువకుడు దొరికిపోయాడు. ఆకస్మికంగా పార్క్‌ను తనిఖీ చేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆ యువకుడి చెంపపై కొట్టారు. (AAP MLA Kulwant Singh Sidhu Slaps Youth) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. ఆటమ్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఒక పార్క్‌లో కొందరు యువకులు డ్రగ్స్‌ సేవిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ సిద్ధూకు తెలిసింది. దీంతో ఆయన పోలీసులతో కలిసి ఆ పార్క్‌కు వెళ్లారు. ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరిని చూసి కొందరు అక్కడి నుంచి పారిపోయారు. అయితే డ్రగ్స్‌ సేవిస్తూ ఒక యువకుడు దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ సిద్ధూ మీడియా ముందే ఆ యువకుడి చెంపపై కొట్టారు.కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. యువకుడి చెంపపై ఆప్‌ ఎమ్మెల్యే కొట్టడాన్ని కొందరు తప్పుపట్టారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం తగదని మరికొందరు వ్యాఖ్యానించారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా చూడాలని కొందరు సూచించారు.

పెద్దపల్లి జిల్లాలో విషాదం

ఇన్నాళ్లు ఉపాధి కల్పించిన ఆ రైళ్లే వారి పాలిట మృత్యు పాశాలవుతాయనివారు ఊహించలేకపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ బక్క ప్రాణులు పొట్టకూటి కోసం రైళ్లలో వాటర్‌ ప్యాకెట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ ఇద్దరి వ్యక్తులను విధి చిన్న చూపు చూసింది. రైల్వే స్టేషన్ క్యాంటీన్‌లో వాటర్ క్యాన్స్ వేసి టీ తాగేందుకు రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు(Train) రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇద్దరిని బలితీసుకుంది. ఇన్నాళ్లు ప్రయాణికులకు నీళ్లందించే ఆ కార్మికుల కుటుంబాలకు మాత్రం చివరికి కన్నీళ్లే మిగిలాయి.ఈ హృదయవిదాకర సంఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్‌(Peddapally)లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రాజు(40) యాకూబ్ (45) అనే ఇద్దరు వ్యక్తులు రైళ్లలో, క్యాంటిన్‌లలో వాటర్‌ సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎప్పటిలాగే వాటర్‌ ప్యాకెట్ల్ సరఫరా చేస్తుండగా ప్రమాదవశాత్తు ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌(Telangana Express) ట్రెయిన్‌ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. రాజు, యాకుబ్‌ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* సినీఫక్కీలో స్మగ్లింగ్‌

సినీ ఫక్కీలో ఓ కంటైనర్‌ లోపల గంజాయిని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీ చేయగా దాదాపు రూ.5 కోట్ల విలువైన గంజాయిని బయటపడింది. దీంతో వాహనం డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన గంజాయిని సీజ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద బుధవారం (డిసెంబర్‌ 13) పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుపడింది. సినీ ఫక్కీలో కంటైనర్‌ లోపల గంజాయిని ఉంచి బెంగళూరుకు రవాణా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 500 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు కంటైనర్‌లో గుర్తించారు. పట్టుబడిన గంజాయి కంటైనర్‌ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి విజయవాడ, కడప మీదుగా బెంగళూరుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే పట్టుబడిన డ్రైవర్‌, క్లీనర్‌కు సంబంధించిన వివరాలు కూడా పోలీసులు మీడియాకు వెల్లడించ లేదు.తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బెంగళూరు ప్రాంతంలో సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భారీ మొత్తంలో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్‌ ముఠాలోని సభ్యుల మధ్య విభేదాల తలెత్తడంతో కంటైనర్‌ గంజాయి వస్తున్న సమాచారం బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. కంటైనర్‌లో గంజాయి రవాణా వెనుక పెద్ద తలకాయల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

10 నెల‌ల కాలంలో 2,366 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌

మ‌హారాష్ట్ర‌లో 2,366 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం ప్ర‌క‌టించారు. 10 నెల‌ల కాలంలో అంటే ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు 2,366 మంది రైతులు చ‌నిపోయిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అమ‌రావ‌తి రెవెన్యూ డివిజ‌న్‌లో అత్య‌ధికంగా 951 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలిపారు.రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ పాటిల్ అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి అనిల్ రాత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. అమ‌రావ‌తి త‌ర్వాత ఛ‌త్ర‌ప‌తి సాంబాజీన‌గ‌ర్ డివిజ‌న్‌లో 877 మంది, నాగ‌పూర్ డివిజ‌న్‌లో 257, నాశిక్ డివిజ‌న్‌లో 254 మంది, పుణె డివిజ‌న్‌లో 27 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించామ‌ని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z