ప్రభుత్వం తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోస్తా జిల్లాల్లో తుపాను నష్టాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నందున ‘ఆడుదాం ఆంధ్ర’ను ఈ నెల 26కు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. మొదట నిర్ణయించిన ప్రకారం నవంబరులో కార్యక్రమం ప్రారంభమవ్వాలి. పలు కారణాలతో డిసెంబరు 15కి ప్రభుత్వం వాయిదా వేసింది. దీని ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో మొదటి దశ క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమవ్వాలి. మిగ్జాం వల్ల జరిగిన పంట నష్టాన్ని గుర్తించే పనుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నిమగ్నమయ్యారని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అధికారులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –