Politics

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ సీసీటీవీ సర్వైలెన్స్‌ ప్రాజెక్టుతోపాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు ఏపీ కేబినెట్ అనుమతిచ్చింది. రుణ సేకరణకు ఏపీఎఫ్ఎస్ఎల్‌కు అనుమతివ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం (AP Cabinet meeting) సమావేశమైంది. ఈ భేటీలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

మధురవాడలో ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థకు 11 ఎకరాలు కేటాయింపు.

11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం.

నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి ఆమోదం.

శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురంలో వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటుకు నిర్ణయం.

వృద్ధాప్య పింఛన్లు రూ.3 వేలకు పెంపు ప్రతిపాదనకు ఆమోదం.

విశాఖలోని 4 కారిడార్లలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z