తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఇవాళ చర్చ జరుగుతోంది. శాసనసభలో ఈ తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరిచారు. అంతకుముందు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పేరును సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి.
👉 – Please join our whatsapp channel here –