ప్రముఖ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ (Roshan) హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బబుల్‌గమ్’ (Bubblegum). మానస చౌదరి కథానాయిక. రవికాంత్ పేరెపు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 29న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ‘బబుల్‌గమ్’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియురాలి వల్ల అవమానం ఎదుర్కొన్న యువకుడు.. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడు, ఏ విధంగా ఆమెపై రివెంజ్ తీర్చుకున్నాడు అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఆద్యంతం యువతను ఆకట్టుకునేలా సాగింది.
👉 – Please join our whatsapp channel here –