సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న కేసీఆర్ భద్రతను వై కేటగిరీకి కుదించారు. 4+4 గన్‌మెన్‌లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్ భద్రత కోసం కేటాయించనున్నారు. ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంచనున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం 2+2 గన్‌మెన్‌లను ఉంచి ఎమ్మెల్యేగా లేని వారికి గన్‌మెన్‌లను పూర్తిగా తొలగించారు. ఇక మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లకు ఉన్న గన్‌మెన్లను తొలగించారు.
👉 – Please join our whatsapp channel here –