తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం.
తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి ఉంది.
4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది. మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోంది.
అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తాం. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నాం.
ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించాం. హమీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై తొలి సంతకం చేశారు.
👉 – Please join our whatsapp channel here –