మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం (Kavitha Kalvakuntla) చేశారు. ఒక మహిళగా ఆమె అలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు.
‘‘నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సింది పోయి.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించింది. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు మహిళగా బాధపడుతున్నా. నెలసరి మనకున్న ఎంపిక కాదు. అదొక సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించినట్లే’’ అని కవిత్ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –