మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహా సంకటంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని ఏ బస్సు చూసినా మహిళా ప్రయాణికులే. బస్టాండులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. బస్సుల్లో పురుష ప్రయాణికులు కనిపించడం లేదు. ఒకవేళ ఒకరిద్దరు ఉన్నా వారికి టికెట్ ఇవ్వడానికి కండక్టర్ ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం రామాయంపేట బస్టాండ్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసి కనిపించాయి.
అప్పటికే బస్సులో 150 మంది వరకు మహిళా ప్రయాణికులు ఉండగా, రామాయంపేటలో మరో 50 మంది మహిళలు ఎక్కా రు. దీంతో కండక్టర్‌కు పురుషుల టికెట్ ఇచ్చేందుకు నానాతంటాలు పడ్డారు. ఉచిత బస్సు ప్రయాణంతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో బస్సులో రెండు వందలకు పైగా ప్రయాణికులు ఎక్కడంతో డ్రైవర్, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –