కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న కెప్టెన్ మిల్లర్ (Captain Miller) షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ధనుష్ స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం D50 షూటింగ్ కూడా షురూ అయింది. ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
నిన్న రాత్రి ధనుష్ ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించాడు. D50 షూటింగ్ పూర్తయింది. నా చిత్రయూనిట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. నా విజన్‌ను సపోర్ట్ చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధిమారన్ సార్‌కు కృతజ్ఞతలు.. అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విష్ణువిశాల్, దుషారా విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో ధనుష్ పవర్ ప్యాక్‌డ్ రోల్‌లో కనిపించబోతున్నాడట. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ధనుష్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. కాగా D50లో బుట్టబొమ్మ ఫేం అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా నటించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అనిఖా సురేంద్రన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నది తెలియాల్సి ఉంది.
👉 – Please join our whatsapp channel here –