NRI-NRT

ఆవ నూనెను నిషేదించిన అమెరికా

ఆవ నూనెను నిషేదించిన అమెరికా

ఆవనూనె.. ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. చాలామంది దీనిని వంటకు కూడా వాడతారు. కాని అమెరికా.. యూరప్​ దేశాల్లో ఆవ నూనెను వంటకు వాడరాదని అక్కడి ప్రభుత్వాలు బ్యాన్​ చేశాయి.. అంతేకాదు..అమెరికాలో లభించే ఆవనూనె ప్యాకింగ్​ పై Only used for Externel అని కూడా రాసి ఉంటుంది. అక్కడ ఆవనూనెను వంటకు నిషేధించారో తెలుసుకుందాం. . . .

నూనె లేకుండా ఏకూర వండలేము. చివరకు పప్పు వండాలన్నా అందులో తాలింపు వేయడానికి నూనె అవసరం. అయితే ప్రపంప వ్యాస్తంగా చాలా రకాల నూనెలు ఉన్నాయి. మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, కనోలా ఆయిల్, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె, పామోలిన్ ఆయిల్ ఇలా ఎన్నో రకాల ఆయిల్స్​ మార్కెట్లో లభిస్తాయి. అయితే ఇండియాలో ఎక్కువుగా ఆవాల నూనెను వంటకు వాడుతారు. కాని అమెరికాలో ఆవనూనెను నిషేదించారు. అమెరికా… ఐరోపా దేశాల్లో ఆవనూనెను మాత్రం వాడరు.

ఆవనూనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీవైరల్. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. నొప్పి మరియు వాపు తగ్గిస్తుంది. ఎవరికైనా కీళ్ల నొప్పులు ఉంటే కర్పూరంతో వేడిచేసిన తర్వాత అప్లై చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ నూనెను భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఇది అమెరికాలో నిషేధించబడింది.

ఈ మధ్య కొన్ని దేశాలలో జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి అని తెలుస్తోంది. ఆవ నూనె వల్ల మెదడుకు హాని వాటిల్లడంతోపాటు బరువు పెరగడానికి కూడా ఆవ నూనె కారణం అవుతోందని పరిశోధకుల అభిప్రాయం. ఆవ నూనెలో యూరిక్ యాసిడ్ తక్కువ మోతాదులో ఉంటుంది. ఆవ నూనె మెదడులో అమీలాయిడ్ ఫలకాలు ఏర్పడటానికి … అల్జీమర్ వ్యాధికి కారణం అవుతోందని పరిశోధకులు తెలియచేస్తున్నారు. ఫలితంగా మెదడులోని న్యూరో వ్యవస్థ పనితీరు దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గుతుందని శాస్త్ర వేత్తల అభిప్రాయం. అయితే ఆవ నూనెతో జ్ఞాపక శక్తి తగ్గుతుండగా ఆలివ్ ఆయిల్‌ తో మాత్రం అందుకు విరుద్ధంగా జ్ఞాపకశక్తి పెరుగుతుందని లేటెస్ట్ పరిశోదనలు తెలియచేస్తున్నాయి.

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఆవాల నూనె వంటకు ఉపయోగించడం హానికరమని వెల్లడించింది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందని … ఇది ఆరోగ్యానికి చాలా నష్టం కలుగజేస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు. ఎరుసిక్ అనేది కొవ్వు పదార్దం… ఇది జ్ఞాపకశక్తిని తగ్గించి … కొవ్వు పేరుకుపోయేలా దోహదపడుతుంది. అందుకే దీనిపై అమెరికాతో పాటు, యూరోపియన్ యూనియన్ , కెనడా దేశాల్లో దీనిని వంటకు ఉపయోగించడాన్ని బ్యాన్​చేశారు.

అమెరికాలో ఆవనూనె ప్యాకింగ్​ పై Only used for Externel ( బాహ్యవినియోగం) అని ప్రింట్​ చేసి ఉంటుంది. అంటే దీనిని శరీరంలోపలికి తీసుకోకూడదు. కాబట్టి అమెరికా… యూరప్‌లోని చాలా దేశాలలో, సోయాబీన్ నూనెను వంట కోసం ఉపయోగిస్తారు. సోయాబీన్ నూనెలో కొల్లాజెన్‌ను ప్రోత్సహించే ఒమేగా .. కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి చర్మానికి సౌందర్యాన్ని ఇస్తుంది. ఈ నూనెలో ఉండే పోషకాల వల్ల ముఖం ముడతలు తగ్గుతాయి. సోయా నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z