అమరావతి ఒకప్పటి ధరణి కోట. శాతవాహనుల రాజధాని. చరిత్ర ఘనం. అమరావతి ఇప్పుడు ఒక ఉద్యమం. ఆ ఉద్యమానికి ఈ రోజుతో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని నిర్ణయించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. దాంతో అమరావతి అభివృద్ధి కోసం అక్కడి రైతులు భూములు ఇచ్చారు. ఇలా ప్రభుత్వం దాదాపు 30వేల ఎకరాల భూమిని సేకరించింది. భారత ప్రధాని చేతుల మీదుగా రాజధాని నగర నిర్మాణానికి అక్టోబర్ 22, 2015 శిలాన్యాసం (శంకుస్థాపన) జరిగింది. అక్టోబర్ 28 2016లో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవన సముదాయానికి శిలాన్యాసం (శంకుస్థాపన) చేశారు. అమరావతి నిర్మాణాన్ని 33,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించారు
ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మాణాన్ని చేపట్టటమే లక్ష్యంగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేశారు. తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టుతోపాటూ.. ఇతర తాత్కాలిక ప్రభుత్వ భవన సముదాయాన్ని నిర్మించి అక్కడ నుంచే పరిపాలన సాగించారు. ఐతే.. ఐదేళ్లలో ఆయన ప్రజలు ఆశించిన స్థాయిలో అమరావతిని అభివృద్ధి చెయ్యలేదు. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. దాంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చూసింది. అలాగే వైసీపీ.. చరిత్రాత్మక భారీ విజయాన్ని అందుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభించారు.
👉 – Please join our whatsapp channel here –